'సారీ ఆగలేకపోయాను..!' | Ileana tweet about her picture | Sakshi
Sakshi News home page

'సారీ ఆగలేకపోయాను..!'

Dec 1 2015 10:12 AM | Updated on Sep 3 2017 1:19 PM

'సారీ ఆగలేకపోయాను..!'

'సారీ ఆగలేకపోయాను..!'

గోవా బ్యూటి ఇలియానా.., సినిమా అవకాశాలు లేకపోయినా అభిమానులు మాత్రం మరిచిపోకుండా ఏదో ఒక విధంగా అలరిస్తూనే ఉంది. బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాకు టాటా చెప్పిన...

గోవా బ్యూటీ ఇలియానా.., సినిమా అవకాశాలు లేకపోయినా అభిమానులు మాత్రం మరిచిపోకుండా ఏదో ఒక విధంగా అలరిస్తూనే ఉంది. బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాకు టాటా చెప్పిన ఈ సుందరి, తరువాత అక్కడ కూడా సరైన అవకాశాలు రాకపోవటంతో మరోసారి దక్షిణాది వైపు చూస్తోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోయిన్లకు భారీ పోటీ ఉండటంతో ఇలియానా వైపు చూసేవారే కరువయ్యారు.

దీంతో అభిమానులు మర్చిపోకుండా ఫొటో షూట్లు, పబ్లిక్ ఫంక్షన్లతో పాటు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఏదో ఒక వార్త క్రియేట్ చేస్తూనే ఉంది ఇల్లీ బేబీ. తాజాగా ల్యాండ్ లైన్ ఫోన్ పట్టుకుని దిగిన ఓ హాట్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్ పేజ్లపై షేర్ చేసిన ఇలియానా, ' హలో ఇది నేనే.. సారీ ఆదిల్.. ఆగలేకపోయాను' అంటూ ట్వీట్ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement