ఏడాదంతా అదే చేశా! | ileana d'cruz act in Just only one film this year | Sakshi
Sakshi News home page

ఏడాదంతా అదే చేశా!

Dec 29 2015 11:45 PM | Updated on Sep 3 2017 2:46 PM

ఏడాదంతా అదే చేశా!

ఏడాదంతా అదే చేశా!

ఇలియానా ఇప్పుడేం చేస్తున్నారు? చేతినిండా సినిమాలైతే లేవు. జస్ట్ ఒకే ఒక్క సినిమా ఉందట.

ఇలియానా ఇప్పుడేం చేస్తున్నారు? చేతినిండా సినిమాలైతే లేవు. జస్ట్ ఒకే ఒక్క సినిమా ఉందట. అది కూడా హిందీ సినిమా. ఆ సినిమా చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. అది పట్టాలెక్కితేనే ఆ సినిమా అయినా ఉన్నట్లు లెక్క. చేతిలో సినిమాలేవీ లేకపోయినా  ఇలియానా బిజీగానే ఉన్నారట. ఎలా? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మధ్య ఇలియానాకు కొత్తగా ఒక ఇష్టం ఏర్పడింది. అదే ‘ఫొటోగ్రఫీ’. ఒక మంచి కెమేరా కొనుక్కోవాలనుకున్నారట. షాపింగ్ అంటూ మాల్స్ చుట్టూ తిరిగే బదులు ఇంటిపట్టునే కూర్చుని ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే బెటర్ కదా అనుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఓ మంచి కెమేరా కొనుక్కున్నారు.
 
  అది చేతికి అందినప్పటి నుంచీ కంటికి నచ్చిందల్లా తన కెమెరాతో క్లిక్‌మనిపిస్తున్నారు. ‘‘పిల్లలను ఎక్కువగా ఫొటోలు తీస్తున్నాను. వాళ్లు బెస్ట్ మోడల్స్ అని నా అభిప్రాయం. ఈ ఏడాది ఎక్కువగా ఫొటోలు తీయడమే చేశా’’ అని చెప్పారు. హిందీలో ఆమె చేసిన చివరి చిత్రం ‘హ్యపీ ఎండింగ్’ గత ఏడాది విడుదలైంది. ‘ఏడాది పాటు సినిమాలు ఒప్పుకోకుండా ఎందుకు ఖాళీగా ఉన్నారు?’ అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే - ‘‘ఈ ఏడాది కాలంలో చాలా కథలు విన్నాను. నన్ను ఎగ్జయిట్ చేసే కథ ఏదీ రాలేదు. మంచి కథ, చక్కని పాత్ర అయితేనే చేయాలనుకుంటున్నా. అలా అనుకోవడం వల్లే ఈ గ్యాప్ వచ్చింది’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement