ఇళయ దళపతికి గాలం | Ilayathalapathy Vijay's forthcoming film Vijay 58 | Sakshi
Sakshi News home page

ఇళయ దళపతికి గాలం

Jan 17 2015 4:07 AM | Updated on Sep 2 2017 7:46 PM

ఇళయ దళపతికి గాలం

ఇళయ దళపతికి గాలం

ఇళయ దళపతి విజయ్‌కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా.

ఇళయ దళపతి విజయ్‌కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో రాణించాలని ఆకాంక్షించే ఉత్తరాది బ్యూటీస్ జాబితాలో చేరిందీ భామ. ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానంది. అలా సినీ అవకాశాలు వరించినట్లు చెప్పింది. పంజాబిలో బెస్ట్ ఆఫ్ లక్, పంజాబ్ 1984 చిత్రంలో నాయికగా నటించానని పేర్కొంది. తర్వాత తమిళంలో కప్పల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం దని తెలిపింది.

ఈ చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని వెల్లడించింది. చిత్ర యూనిట్ సహకారం మరువలేనిదంది. కప్పల్ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇక్కడ తొలి చిత్రమే విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన నటించడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని అసలు విషయం చెప్పింది. కప్పల్ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, వాటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement