'సినిమా విలన్లూ ఫిట్ గా ఉండాలి' | If you're fit, you're hit: Kabir on playing villain | Sakshi
Sakshi News home page

'సినిమా విలన్లూ ఫిట్ గా ఉండాలి'

Mar 31 2015 12:53 PM | Updated on Sep 2 2017 11:38 PM

'సినిమా విలన్లూ ఫిట్ గా ఉండాలి'

'సినిమా విలన్లూ ఫిట్ గా ఉండాలి'

హీరోలతో పాటు విలన్లకు దేహదారుఢ్యం చాలా ముఖ్యమని నటుడిగా మారిన మోడల్ కబీర్ దుహన్ సింగ్ అన్నాడు.

చెన్నై: హీరోలతో పాటు విలన్లకు దేహదారుఢ్యం చాలా ముఖ్యమని నటుడిగా మారిన మోడల్ కబీర్ దుహన్ సింగ్ అన్నాడు. సినిమా రంగంలో ఫిట్ గా ఉంటేనే హిట్ అవుతారని వ్యాఖ్యానించాడు. గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో అతడు విలన్ గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే ప్రతినాయకుడిగా మెప్పించాడు.

'ఫిట్ నెస్ హీరోలు ఒక్కరికే ఇంపార్టెంట్ కాదు. వెండితెరపై విలన్ పాత్రలు పోషించే వారు కూడా ఫిట్ నెస్ కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. మనమంతా వినోద రంగంలో ఉన్నాం. స్క్రిన్ పై ఎలా కనబడతామన్నదే ఇక్కడ ప్రాధానం' అని కబీర్ అన్నాడు.

'జిల్'లో తాను చేసిన డాన్ పాత్రకు మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత వెల్లువలా అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు. రవితేజ హీరోగా నటించిన 'కిక్ 2' సినిమాలోనూ విలన్ గా నటించానని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement