కిస్ మి ఎవ్రీవేర్... | Ice Cream 2 song Kiss Me Everywhere: Is Ram Gopal Varma’s new find Naveena,the next Poonam Pandey? | Sakshi
Sakshi News home page

కిస్ మి ఎవ్రీవేర్...

Sep 1 2014 11:57 PM | Updated on Sep 2 2017 12:43 PM

కిస్ మి ఎవ్రీవేర్...

కిస్ మి ఎవ్రీవేర్...

ఫ్లోకామ్ టెక్నాలజీతో వెండితెరపై ఓ కొత్త ఒరవడి సృష్టించిన సినిమా ‘ఐస్‌క్రీమ్’. దాని సిరీస్‌లో వస్తున్న ‘ఐస్‌క్రీమ్-2’కి ఫ్లోకామ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడాం. సాంకేతికంగా ఈ చిత్రం ఓ విప్లవం అవుతుంది’’

 ఫ్లోకామ్ టెక్నాలజీతో వెండితెరపై ఓ కొత్త ఒరవడి సృష్టించిన సినిమా ‘ఐస్‌క్రీమ్’. దాని సిరీస్‌లో వస్తున్న ‘ఐస్‌క్రీమ్-2’కి ఫ్లోకామ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడాం. సాంకేతికంగా ఈ చిత్రం ఓ విప్లవం అవుతుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. జె.డి.చక్రవర్తి, నందు, నవీనా, భూపాల్, సిద్దు, శాలినీ, గాయత్రి ప్రధాన పాత్రధారులుగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఐస్‌క్రీమ్-2’. ‘కిస్ మి ఎవ్రీవేర్’ అనే పల్లవితో ఆద్యంతం ఆంగ్లంలో సాగే ఈ చిత్రంలోని ఏకైక గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
  ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ -‘‘అందాన్ని చూపించాలంటే ముందు చూడగలిగే హృదయం కావాలి. నాకు ఆ హృదయం ఉంది కాబట్టే ఈ పాట ఇంతబాగా వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వర్మ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు తీసి, ఒకే దర్శకునితో అత్యధిక చిత్రాలు తీసిన నిర్మాతగా గిన్నిస్‌బుక్‌కి ఎక్కాలని ఉందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆకాంక్షించారు. ‘‘ ‘కిస్ మి ఎవ్రీవేర్’ పాట చిత్రీకరించే సమయంలో నేనున్నాను. బాగా వస్తుందనుకున్నాను కానీ, ఇంత అద్భుతంగా వస్తుందని మాత్రం అనుకోలేదు. తెరపై పాట చూసి తీయని షాక్‌కి లోనయ్యాను’’ అని జె.డి.చక్రవర్తి అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement