‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది | i will do it ' ninne pelladatha ' Like the movie says naga sourya | Sakshi
Sakshi News home page

‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది

Jun 26 2014 12:29 AM | Updated on Sep 2 2017 9:23 AM

‘నిన్నే పెళ్లాడతా’ లాంటి  సినిమాలో చేయాలని ఉంది

‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో చేయాలని ఉంది

‘‘కెరీర్‌లో ఎప్పటికైనా నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. అలాగే..

‘‘కెరీర్‌లో ఎప్పటికైనా నాగార్జునగారి ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. అలాగే... ప్రముఖ దర్శకులందరితో పనిచేయాలనుంది’’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. ఆయన కథానాయకునిగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుస లాడే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉందని నాగశౌర్య ఆనందం వెలిబుచ్చారు.

సినిమా అవకాశాలకోసం తిరిగి తిరిగి చివరి ప్రయత్నంగా ఈ ఆడిషన్స్‌లో పాల్గొన్నానని, మంచి పాత్రతో ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని నాగశౌర్య తెలిపారు. కెరీర్‌ని జాగ్రత్తగా మలచుకోవాలనుకుంటున్నానని, ప్రస్తుతం సాయి కొర్రపాటి నిర్మాణంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా చేస్తున్నానని, రాజమౌళి సహాయకుడు కోటి ఈ సినిమాకు దర్శకుడని, అలాగే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా కూడా చేస్తున్నానని శౌర్య చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement