మద్యపానం మానేశా : నటి | I Quit drinking Said Actress Sona | Sakshi
Sakshi News home page

మద్యపానం మానేశా

Dec 24 2019 7:52 AM | Updated on Dec 24 2019 7:52 AM

I Quit drinking Said Actress Sona - Sakshi

చెన్నై,పెరంబూరు: మద్యం తాగడాన్ని మానేశానంటోంది నటి సోనా. శృంగార తారగా ముద్ర వేసుకున్న ఈ భామ తమిళంతో పాటు పలు భాషల్లో నటించింది. తమిళంలో కుశేలన్‌ షాజహాన్, గురు ఎన్‌ఆళు వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చివరిగా గత ఏడాది ప్రశాంత్‌ హీరోగా నటించిన జానీ చిత్రంలో కనిపించింది. ఈ అమ్మడు చాలా డేరింగ్‌ లేడీ అనే పేరు తెచ్చుకుంది. పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు కూడా ఈమెకి ఉన్నాయి. ఆ మధ్య చిత్ర నిర్మాణం కూడా చేపట్టింది.అయితే అది ఆదిలోనే ఆగిపోయింది. ఇకపోతే అంతకు ముందు ఏదో వివాదంతో తరచూ  వార్తల్లో ఉండే సోనా ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. దీంతో నటి సోనా నటనకు గుడ్‌బై చెప్పిందనీ, అసలు ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో సోనా స్పందించింది.ఒక ప్రకటనను సోమవారం మీడియాకు విడుదల చేసింది. అందులో కొందరు తన గురించి నిరాధార ప్రచారం చేస్తున్నారని, తాను సినిమాల్లో నటించడం లేదనీ, ఎక్కడికో వెళ్లిపోయాను అనీ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. నిజానికి తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటనకూ దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటించానని, 12 చిత్రాలను నిరాకరించినట్లు చెప్పింది. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని చెప్పింది. డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. ఇంతకు ముందులా కాకుండా తానిప్పుడు చాలా పరిపక్వత చెందినట్లు పేర్కొంది. మద్యపానం మానేశానని చెప్పింది. ఈ ఏడాదిలో తాను ఛేజింగ్, పరమ పదం విళైయాట్టు, అసాల్ట్, తేడుదల్, పచ్చమాంగా తదితర చిత్రాల్లో నటించానని, నూతన సంవత్సరంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని నటి సోనా తెలిజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement