న్యూడ్ గా నటించేందుకు సై | I don't see anything wrong in stripping for a role | Sakshi
Sakshi News home page

న్యూడ్ గా నటించేందుకు సై

Mar 28 2016 1:26 PM | Updated on Sep 3 2017 8:44 PM

న్యూడ్ గా నటించేందుకు సై

న్యూడ్ గా నటించేందుకు సై

న్యూడ్ గా నటించేందుకు అభ్యంతరం లేదంటోంది మరాఠి మోడల్ నటి నికిత గోఖలే.

ముంబై: న్యూడ్ గా నటించేందుకు అభ్యంతరం లేదంటోంది మరాఠి మోడల్, నటి నికిత గోఖలే. ఎక్స్ పోజింగ్ చేయబోనని గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మనసు మార్చుకోవడం విశేషం. పాత్ర డిమాండ్ చేస్తే ఎటువంటి సంకోచాలు లేకుండా నటిస్తానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

'సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన'ని నికిత గోఖలే పేర్కొంది. ప్రస్తుతం మరాఠిలో సినిమాలో నటిస్తున్న ఆమె త్వరలోనే రవి జాదవ్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపింది.

Advertisement

పోల్

Advertisement