హైదరాబాద్ ప్రేమకథ | Hyderabad love story | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ప్రేమకథ

Oct 28 2014 10:53 PM | Updated on Sep 2 2017 3:30 PM

హైదరాబాద్ ప్రేమకథ

హైదరాబాద్ ప్రేమకథ

హైదరాబాద్ ప్రేమకథ అనగానే టక్కున గుర్తొచ్చేది భాగమతి, కులీ కుతుబ్‌షాల ప్రేమగాధే. కాల గమనంలో కొన్ని వేల ప్రేమకథలకు హైదరాబాద్ వేదిక అయ్యింది.

 హైదరాబాద్  ప్రేమకథ అనగానే టక్కున గుర్తొచ్చేది భాగమతి, కులీ కుతుబ్‌షాల ప్రేమగాధే. కాల గమనంలో కొన్ని వేల ప్రేమకథలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఆ ప్రేరణతో రూపొందుతోన్న చిత్రమే ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, రేష్మీ మీనన్, జియా ప్రధాన పాత్రధారులు. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వినోదాత్మకంగా సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్‌కు ఈ చిత్రంలోని ప్రేమకథకు ఉన్న అనుబంధం ఏంటో తెరపైనే చూడాలి. సునీల్‌కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 9న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. కెమెరా: బీవీ అమరనాథ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పిన్నింటి రాజేందర్‌రెడ్డి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, సమర్పణ: ఎస్.పద్మజ, నిర్మాణం: ఎస్‌ఎన్‌ఆర్ ఇండియా ప్రై.లిమిటెడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement