హైదరాబాద్ ప్రేమకథ | Hyderabad love story | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ప్రేమకథ

May 10 2016 10:46 PM | Updated on Sep 3 2017 11:48 PM

హైదరాబాద్ ప్రేమకథ

హైదరాబాద్ ప్రేమకథ

‘అలా ఎలా’ చిత్రంతో యువతను ఆకట్టుకున్న కథానాయకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’.

 ‘అలా ఎలా’ చిత్రంతో యువతను ఆకట్టుకున్న కథానాయకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ఎస్.పద్మజ సమర్పణలో ఎస్‌ఎన్‌ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి నిర్మించారు. రేష్మీ మీనన్, జియా కథానాయికలు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.
 
  నిర్మాత సి.కల్యాణ్ చిత్రబృందానికి ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘నేను, ఎస్.ఎన్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్  వ్యాపారం చేశాం. ఇప్పుడు ఇద్దరం సినిమా రంగంలోకి వచ్చేశాం. ట్రైలర్‌లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. రాహుల్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ఈ చిత్రం నాకు మంచి అనుభవం. క్వాలిటీ విషయంలో ఎస్.ఎన్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడలేదు.
 
  జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్ సత్య, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బివి అమర్‌నాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నంటి, సహ నిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement