breaking news
Jia
-
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వినోదంతోపాటు సందేశం ఉన్న చిత్రాలు వస్తే బాగుంటుంది. ఈ చిత్రం టైటిల్ బాగుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రాజ్ సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ఎస్. పద్మజ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో భీమినేని శ్రీనివాసరావు, వీఎన్ ఆదిత్య, జితేంద్ర, సందీప్ కిషన్, నవీన్‌చంద్ర, మనాలి రాధోడ్, దీక్షా పంత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. లవ్, ఎంటర్టైన్మెంట్ సమాహారంతో సాగుతుంది’’ అన్నారు. ఇది ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అని దర్శకుడు తెలిపారు. సునీల్ మంచి పాటలిచ్చారని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. -
హైదరాబాద్ ప్రేమకథ
హైదరాబాద్ ప్రేమకథ అనగానే టక్కున గుర్తొచ్చేది భాగమతి, కులీ కుతుబ్షాల ప్రేమగాధే. కాల గమనంలో కొన్ని వేల ప్రేమకథలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఆ ప్రేరణతో రూపొందుతోన్న చిత్రమే ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, రేష్మీ మీనన్, జియా ప్రధాన పాత్రధారులు. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వినోదాత్మకంగా సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్‌కు ఈ చిత్రంలోని ప్రేమకథకు ఉన్న అనుబంధం ఏంటో తెరపైనే చూడాలి. సునీల్‌కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 9న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. కెమెరా: బీవీ అమరనాథ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పిన్నింటి రాజేందర్‌రెడ్డి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, సమర్పణ: ఎస్.పద్మజ, నిర్మాణం: ఎస్ఎన్ఆర్ ఇండియా ప్రై.లిమిటెడ్.