
తండ్రి రాకేశ్ రోషన్ (బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత) గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు హీరో హృతిక్ రోషన్ మంగళవారం తెలిపారు. ‘‘మంగళవారం ఉదయం నాన్నగారిని నాతో ఫొటో దిగమని అడిగాను. ఆపరేషన్ రోజు కూడా వర్కౌట్స్ చేయడానికి ఆయన జిమ్‌కు వచ్చారు. నాకు తెలిసిన స్ట్రాంగ్ పర్సన్ మా నాన్నగారు. తొలి దశలో ఉన్న గొంతు క్యాన్సర్‌తో ఆయన కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. మా కుటుంబంలో ఆయనలాంటి లీడర్ ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాం.
లవ్ యు డాడీ’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు రాకేశ్ రోషన్ అభిమానులు ‘‘గెట్ వెల్ సూన్’’ అని స్పందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘క్రిష్’ ఫ్రాంచైజీలో హృతిక్ హీరోగా రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి.. రాకేశ్ కోలుకున్న తర్వాత ఈ సినిమా ఆరంభిస్తారా లేక వేరే దర్శకుడితో మొదలుపెడతారా? అన్నది చూడాలి.