స్టార్ హీరో డిఫరెంట్ మేకోవర్‌ | Hrithik Roshan look from Anand Kumar biopic | Sakshi
Sakshi News home page

Feb 6 2018 10:38 AM | Updated on Feb 6 2018 11:51 AM

Hrithik Roshan in Super 30 - Sakshi

‘సూపర్‌ 30’ చిత్రంలో హృతిక్‌ రోషన్‌

కాబిల్ సక్సెస్ తరువాత మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నాడు హృతిక్‌. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సూపర్‌ 30 పేరుతో స్కూల్‌ ప్రారంభించిన ఆనంద్‌ కుమార్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు.

బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హృతిక్‌ లుక్‌ కు సంబంధించిన స్టిల్‌ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. గుబురు గెడ్డంతో డిఫరెంట్‌ గా కనిపిస్తున్న హృతిక్‌ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement