ఐశ్వర్య బికినీ బలాదూర్ అట! | Hrithik Roshan, Katrina Kaif Overwhelmed by Response to Bang Bang Teaser | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య బికినీ బలాదూర్ అట!

Jul 26 2014 12:08 AM | Updated on Sep 2 2017 10:52 AM

హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిని తిలకించిన వారందరూ ‘మళ్లీ బాలీవుడ్ తెరపై కత్రినా హవా మొదలుకానుంద’ని తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిని తిలకించిన వారందరూ ‘మళ్లీ బాలీవుడ్ తెరపై కత్రినా హవా మొదలుకానుంద’ని తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచార చిత్రాల్లో కత్రినా చేసిన ఫీట్లు అలా ఉన్నాయి మరి. ‘క్రిష్’, ‘ధూమ్-2’ చిత్రాలను తలదన్నేలా ఇందులో హృతిక్ సాహసాలు చేస్తే... హృతిక్‌కు దీటుగా కత్రినా చేసిన విన్యాసాలు ఈ ట్రైలర్స్‌లో హైలైట్‌గా నిలిచాయి.

ఇవి మచ్చుకు మాత్రమే అనీ, సినిమాలో కత్రినా చేసిన ఫీట్స్ ఇంతకు మించేలా ఉంటాయని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. కత్రినా స్విమ్ సూట్‌లో పది నిమిషాలకు పైగా కనిపించడం ‘బ్యాంగ్ బ్యాంగ్’లో మరో విశేషం. ‘ధూమ్’ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్, బిపాసా బసు కూడా స్విమ్ సూట్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలను మరపించేలా ఇందులోని స్విమ్ సూట్ సీన్ ఉంటుందని బాలీవుడ్ టాక్. పైగా ఆ సన్నివేశంలో హృతిక్‌తో కలిసి కత్రినా ఘాటుగా నటించిందని విశ్వసనీయ సమాచారం.
 
అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళాల్లోనూ విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ బాగున్నా యంటూ దర్శకుడు రాజమౌళి సైతం వ్యాఖ్యా నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement