నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో | Hrithik: I'm so glad Sussanne liked Kaabil | Sakshi
Sakshi News home page

నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో

Jan 26 2017 3:40 PM | Updated on Sep 5 2017 2:11 AM

నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో

నా మాజీ భార్యకు నచ్చడం సంతోషం: హీరో

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన తాజా సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో సంతోషంగా ఉన్నాడు.

ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో అతను సంతోషంగా ఉన్నాడు. అంతేగాక మాజీ భార్య సుసానే ఖాన్.. కాబిల్‌ స్పెషల్ షో చూడటంతో పాటు ఈ సినిమా బాగుందని, హృతిక్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించడం హృతిక్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. హృతిక్ ఓ  ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు.

భారత చలనచిత్ర చరిత్రలో.. ఇది అద్భుత ప్రదర్శనని, హృతిక్కు కాబిల్‌ మంచి పేరు తెస్తుందని, ఈ సినిమా యూనిట్కు అభినందనలు తెలుపుతూ సుసానె ట్వీట్ చేసింది. హృతిక్తో కలిసున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేసింది. దీనిపై హృతిక్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. కాబిల్‌ సినిమా సుసానెకు నచ్చడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు.. ఇప్పట్లో ఆ ఉద్దేశంలేదన్నాడు.

గత ఏడాది కంగనా రనౌత్‌తో గొడవ, వరుస ప్లాఫులతో సతమతమవుతున్న హృతిక్‌.. తన తాజా సినిమా కాబిల్కు హిట్‌ టాక్ రావడం, తన మాజీ భార్య ప్రశంసించడంతో అతనికి ఆత్మవిశ్వాసం కలిగించినట్టయ్యింది. హృతిక్, సుసానె తమ పదమూడేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తమ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు మరింత సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్లు మళ్లీ దగ్గరయ్యే అవకాశముందని సన్నిహితులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement