హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా | Housefull 4 Is Unstoppable At Box Office | Sakshi
Sakshi News home page

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

Oct 29 2019 2:09 PM | Updated on Oct 29 2019 2:17 PM

Housefull 4 Is Unstoppable At Box Office - Sakshi

ఖిలాడీ మూవీ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది..

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ రైడర్‌ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల హవా కొనసాగిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో రూ 90 కోట్లకు చేరువై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్‌ 4 సోమవారం జాతీయ సెలవు దినంతో ఏకంగా రూ 34.56 కోట్లు రాబట్టి నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ 87.78 కోట్లు వసూలు చేసింది. సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాణ భాగస్వామ్యంతో ఫర్హాద్‌ సంజీ నిర్ధేశకత్వంలో రూపొందిన హౌస్‌ఫుల్‌ 4లో ఖిలాడీ అక్షయ్‌తో పాటు కృతి సనన్‌, బాబీ డియోల్‌, కృతి కర్బంద, రితీష్‌ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ప్రేక్షకులను అలరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement