హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ సల్మాన్ | highest advance tax payer salman Khan | Sakshi
Sakshi News home page

హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ సల్మాన్

Oct 8 2016 10:42 AM | Updated on Sep 4 2017 4:40 PM

హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ సల్మాన్

హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్ సల్మాన్

వరుస సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షాగా అవతరించిన సల్మాన్ ఖాన్, తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ప్రతీ సినిమాతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు...

వరుస సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షాగా అవతరించిన సల్మాన్ ఖాన్, తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ప్రతీ సినిమాతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్న కండల వీరుడు పారితోషికంగా కూడా అదే స్థాయిలో అందుకుంటున్నాడు. అందుకే ఈ ఏడాది హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్గా అవతరించాడు సల్మాన్.

ఈ ఏడాది 16 కోట్ల అడ్వాన్స్ టాక్స్ కట్టిన సల్మాన్ నెంబర్ వన్గా నిలవగా, గత ఏడాది 18 కోట్లు పే చేసి నెంబర్ వన్గా ఉన్న అక్షయ్ ఈ ఏడాది కేవలం 11 కోట్లు మాత్రమే కట్టి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఒక్క హిట్ సినిమా కూడా లేకపోయినా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ 7.8 కోట్లు పే చేసి మూడో స్థానంలో నిలిచాడు.

వీరి తరువాతి స్థానాల్లో కపిల్ శర్మ, అమీర్ ఖాన్ లు నిలవగా బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ పేరు తొలి పది స్థానాల్లో కనిపించకపోవటం విశేషం. బాలీవుడ్ టాప్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్లు ఎంత కట్టారు, అన్న వివరాలను ఇన్ కంటాక్స్ డిపార్ట్మెంట్ వారు వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement