నటుడు ప్రకాశ్‌రాజ్‌కు హైకోర్టు నోటీసులు 

High Court Gave Notices To Actor Prakash Raj For Nadigar Film - Sakshi

పెరంబూరు : నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి పేరుగాంచిన నటుడు ప్రకాశ్‌రాజ్‌. ఈయన నటుడు మాత్రమే కాకుండా, నిర్మాత, దర్శకుడు కూడా. తమిళంలో ధోని, ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాశ్‌రాజ్‌ నడిగర్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ చిత్రానికి రీమేక్‌. కాగా ఈ చిత్రానికి ఆయన బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ఆయన ఆ ఫైనాన్సియర్‌కు చెక్కును ఇవ్వగా అది బ్యాంకులో బౌన్స్‌ అయ్యింది.దీంతో ఆ ఫైనాన్సియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయమూర్తి  ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేశారు.  (వారిని చంపేందుకు 29న ముహూర్తం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top