అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు! | Heroine Shruthi Hassan says i like my Dress Style | Sakshi
Sakshi News home page

అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!

Aug 14 2016 12:05 AM | Updated on Sep 4 2017 9:08 AM

అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!

అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!

మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పదే నిలువుటద్దంలో చూసుకుని మురిసిపోతుంటారు కొంతమంది. ఈ టైప్ అమ్మాయిలు తమ ఆత్మానందం

మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పదే నిలువుటద్దంలో చూసుకుని మురిసిపోతుంటారు కొంతమంది. ఈ టైప్ అమ్మాయిలు తమ ఆత్మానందం కోసం మాత్రమే డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇతరుల నేత్రానందం కోసం బట్టలు వేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల కోసం ప్రత్యేకంగా డ్రెస్ చేసుకునే అమ్మాయిలు లేకపోలేదు. శ్రుతీహాసన్ మాత్రం ఈ టైప్ కాదు. ఆ విషయం గురించి ఈ బ్యూటీ చెబుతూ - ‘‘నాకు స్టైల్‌గా ఉండటం ఇష్టం. వెరైటీ డ్రెస్సులు ట్రై చేయడానికి ఏమాత్రం వెనకాడను.
 
 అబ్బాయిల కోసం మాత్రం డ్రెస్ చేసుకోను. అందమైన బట్టలు వేసుకుని వాళ్లను ఆకర్షించాలని అనుకోను. బయటకు వెళ్లినప్పుడు షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్ద అద్దాలు కనిపిస్తాయి కదా.. వాటిలో నా ప్రతిబింబం చూసుకోవడానికి డ్రెస్ చేసుకుంటాను. ఇంట్లో అద్దాలుంటాయ్. కానీ, బయట కనిపించే స్టోర్ అద్దాల్లో నన్ను చూసుకోవడం నాకిష్టం. అందుకే డ్రెస్ చేసుకునేటప్పుడు అద్దాలను కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ సంగతలా ఉంచితే.. డ్రెస్సింగ్ అనేది మన అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో? అని ఆలోచించకూడదు. మనకు సౌకర్యంగా అనిపించే బట్టలు ఇతరులకు చూడ్డానికి బాగాలేకపోయినా వేసుకోవాలి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement