Shruti Haasan Shares Her Isolation Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Shruthi Hassan: కరోనా పాజిటివ్‌, ఐసోలేషన్‌.. చాలా నీరసించిపోయాను

Mar 2 2022 9:54 AM | Updated on Mar 2 2022 11:32 AM

Shruti Hassan Shares Her Isolation Photo And Said Tired - Sakshi

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడటంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  ఈ క్రమంలో ఇటీవల స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్రుతి ట్వీట్‌ చేస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా పరీక్షించానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. ఈ క్రమంతో శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. అయితే ఎప్పుడు స్వేచ్ఛాగా.. సరదాగా ఉండే శ్రుతి కరోనా కారణంగా ఐసోలేషన్‌కు వెళ్లడంతో ఆమె ఫాలోవర్స్‌ కాస్తా బాధపడుతున్నారు.

చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్‌, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే

ఇదిలా ఉంటే శ్రుతి తాజాగా ఐసోలేషన్‌లోని తన కష్టాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ‘కరోనాతో చాలా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు శృతీ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటికి బదులిచ్చిన శృతీ హాసన్‌.. మీ అందరి ఆశీస్సులతో త్వరలో పూర్తిగా కోలుకొని మీ ముందుకు వస్తాను అని సమాధానమిచ్చింది. అయితే ప్రస్తుతం శృతీ హాసన్‌ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండడంతో ఒంటరిగా బోర్‌గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement