
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్‌తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి.
హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్‌ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్‌లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్‌లా వాక్ చేశాడు.
పాలిథీన్ కవర్‌నే కాస్టూమ్‌గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc
— Censored Men (@CensoredMen) September 11, 2023