యాక్షన్‌ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం | Nandamuri Balakrishna Veera Simha Reddy Shooting Updates | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం

Published Fri, Oct 28 2022 1:11 AM | Last Updated on Fri, Oct 28 2022 9:00 AM

Nandamuri Balakrishna Veera Simha Reddy Shooting Updates - Sakshi

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం బాలకృష్ణ, విలన్లపై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథలో కీలక సమయంలో రానున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ పర్యవేక్షిస్తున్నారు.

2023 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి (స్పెషల్‌ నంబర్‌) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చందు రావిపాటి, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రమణ్యం కేవీవీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement