పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌

Heroine Preeti Jhangiani Lodges A Police Complaint - Sakshi

తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ప్రీతీ జంగానియా గుర్తుండే ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచారు.

తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కారణంతో పక్క అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వ్యక్తిపై పోలీసు కంప్లయింట్ ఇచ్చారు ప్రీతీ. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఇరు కుంటుంబాలకు సర్దిచెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top