హీరోయిన్‌ పెళ్లి: ఇన్‌స్టాలో వీడియో

Heroine Mayuri Kyatari Married Her Long Time Boyfriend Arun - Sakshi

బెంగళూరు: కన్నడ హీరోయిన్‌ మయూరి క్యాటరీ లాక్‌డౌన్‌ సమయంలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడైన అరుణ్‌ను వివాహమాడారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీతిరుమలగిరి శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో మయూరి వివాహం జరిగిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. (హిజ్రాలు కూడా మ‌హిళ‌లే: న‌టి)

మయూరి తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసేవరకు ఆమె వివాహం గురించి అటు అభిమానులకు ఇటు సినిమావాళ్లకు తెలియకపోవడం గమనార్హం. ‘అవును నేను, ఆరుణ్‌ ఈ రోజు ఉదయం వివాహం చేసుకున్నాం. పదేళ్ల స్నేహానికి ఈరోజు అర్థవంతమైన ముగింపు లభించింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అందిస్తాను’ అని ఇన్‌స్టాలో పేర్కొంటూ తన మెడలో అరుణ్‌ మూడు ముళ్లు వేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (మహేశ్‌ చిత్రంలో ‘ఈగ’ విలన్‌?)

అయితే గుట్టుచప్పుడుకాకుండా తమ హీరోయిన్‌ పెళ్లి చేసుకోవడంపై ఫ్యాన్స్‌ కాస్త గుర్రుగా ఉన్నప్పటికీ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కన్నడ ఆర్టిస్టులు కూడా మయూరి-అరుణ్‌లకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నక్షత్ర అనే టీవీ సీరియల్‌తో నటిగా అరంగేట్రం చేసిన మయూరి 2015లో కృష్ణ లీలా అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి కన్నడ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, అభిమానులను సొంతం చేసుకున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top