జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్ | hero rana, heroien kajal agarwal acting in the movie nene raju nene mantri | Sakshi
Sakshi News home page

జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్

Aug 10 2017 9:57 AM | Updated on Sep 16 2017 4:19 PM

జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్

జీవితంలో గుర్తుండి పోతుంది- హీరోయిన్

‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు.

‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. బెంజ్ సర్కిల్లోని ట్రెండ్ సెట్ మాల్కు హీరో దగ్గుపాటి రాణా, హీరోయిన్ కాజల్ ఆగర్వాల్, నిర్మాతలు కిరణ్ రెడ్డి, భతర్ చౌదరి విచ్చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రాణా మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తొలిసారిగా నటించినట్లు తెలిపారు.

ఈ సినిమా పక్కా మాస్ సినిమా అని, కుటుంబసమేతంగా చూడదగిన కథాంశంతో తీసినట్లు చెప్పారు. ఈ సినిమాను డైరెక్టర్ తేజ చాలా చక్కగా తీశారని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం.. భార్యభర్తల బంధమే ముఖ్యఅంశమన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

జీవితంలో గుర్తుండిపోతుంది: కాజల్ అగర్వాల్
‘నేనే రాజు.. నేనే మంత్రి’ సినిమా జీవితంలో గుర్తిండిపోయేలా విజయాన్ని సాధిస్తుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమాలో ఎంతో కష్టపడి నటించామని, షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. కాజల్, రాణాలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ట్రెండ్సెట్ మాల్కు తరలివచ్చారు.-లబ్బీపేట (విజయవాడ తూర్పు)

కేల్ యూనివర్శిటీలో సందడే సందడి
వడ్డేశ్వరం: వడ్డేశ్వరంలోని కేల్ యూనివర్శటీలో బుధవారం సినీనటులు సందడి చేశారు. నేనే రాజు-నేనే మంత్రి చిత్ర ప్రచారంలో భాగంగా హీరో రాణా, హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిత్ర యూనిట్ సభ్యులు వర్శిటీకి విచ్చేశారు. వారితో కరచాలనం కోసం విద్యార్థులు పోటీపడ్డారు. రాణా విద్యార్థులందరికీ  అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. వర్శిటీ విద్యార్థి విభాగం డీన్ హబీబుల్లా ఖాన్, హ్యాపీ క్లబ్ విభాగం ఇన్చార్జి శుభాకరరాజు పాల్గొన్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి.. పక్కా మాస్‌ సినిమా. కుటుంబసమేతంగా చూడొచ్చు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ భార్యాభర్తల అనుబంధమే ముఖ్యాంశం. ఇది అందరికీ నచ్చుతుంది.
– రానా, కాజల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement