నేను లోకల్‌ ట్రైలర్ విడుదల | Hero Nani Nenu Local Theatrical Trailer | Sakshi
Sakshi News home page

జండూబామ్‌ కే తలనొప్పి తెప్పించేలా..

Jan 15 2017 11:59 AM | Updated on Sep 5 2017 1:17 AM

నేను లోకల్‌ ట్రైలర్ విడుదల

నేను లోకల్‌ ట్రైలర్ విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని... సంక్రాంతి పండుగ సందర్భంగా 'నేను లోకల్‌' అంటూ హంగామా చేస్తున్నాడు.

నేచురల్‌ స్టార్‌ నాని...  సంక్రాంతి పండుగ సందర్భంగా 'నేను లోకల్‌' అంటూ హంగామా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్  జంటగా నటించిన నేను లోకల్‌ ట్రైలర్‌...సంక్రాంతికి విడుదలైంది. ‘ఒక అమ్మాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతోందంటే అది మార్చి అని అర్థం, అదే ఒక అబ్బాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్’ అని అర్థం అంటూ సహజమైన నటనతో ఎప్పటిలాగే నాని ఇరగదీశాడు.

బుద్ధిమంతుడులా అమ్మానాన్నల కోసం కాలేజీకి వెళతానంటూనే మరోవైపు ఎంబిఎ చదువుతా అమ్మాయిని ఫాలో అవుతానంటూ వాళ్లకి పంచ్‌ వేస్తాడు. హీరోయిన్‌ను ఫాలో అవుతూ ఆమెను డిస్ట్రబ్‌ చేస్తూ ఆమె తండ్రితో వీడు జండూబామ్‌కి తలనొప్పి రప్పించే రకంగా ఉన్నాడంటూ.. పిచ్చెక్కించేలా నాని తన నటనతో హల్‌చల్‌ చేశాడు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తోనే సినిమాతో అంచనాలు పెంచేసిన నాని... ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం  కాకినాడలో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement