
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు మిథున్ కుమార్ హీరోలు సూర్య, అజిత్‌లంటే చాలా ఇష్టమని చెప్పాడు. సినిమా రంగంలోని వారి వారసులకు నటన కొత్త కాదు. సినిమాకు వారసులు వస్తుంటారు. అయితే ఆ వారసులందరూ సక్సెస్ కాలేరు. అందుకు కృషి, పట్టుదల, ప్రతిభ, అన్నింటికీ మించి అదృష్టం ఉండాలి. అవన్నీ తనలో ఉన్నాయని హీరోగా రాణించాలని ఆశిస్తున్నాడు నిర్మాత కుటుంబం నుంచి వచ్చిన యువ నటుడు మిథున్ కుమార్. ఇతను సీనియర్ నిర్మాత ఎస్.ఎ. రాజ్‌కన్ను సోదరుడు కృష్ణస్వామి కొడుకు. కమలహాసన్ హీరోగా మహానది వంటి పలు చిత్రాలను రాజ్‌కన్ను నిర్మించారు.
మిథున్ మాట్లాడుతూ.. పొల్చాచ్చికి చెందిన ఈయన సినిమా ఫ్యాషన్‌తో చెన్నైకి వచ్చారట. ఇటీవల విడుదలైన కలత్తూర్ గ్రామం చిత్రంలో హీరోగా మిథున్ నటించాడు. ‘దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. దర్శకుడు సముద్రకని, మహిళ్ తిరువేణి వద్ద శిష్యరికం చేశాను. చదువుకునే రోజుల్లోనే స్టేజ్ షోలో బహుమతులు పొందాను. నటించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ‘కలత్తూర్’లో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
అద్వైతన్ పొల్లాచ్చి చిత్రం చూసి బాగా చేశావురా అని పెద్దనాన్న అభినందిచారు. దర్శకుడు సముద్రకని కూడా బాగా నటించావు అని ప్రశంసించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దర్శకుడు రాజమౌళి శిష్యుడు ప్రదీప్ తమ్మినేని ఫోన్ చేసి కలత్తూర్ చిత్రం చూశాను. మీరు బాగా నటించారు. మనం కలిసి ఒక చిత్రం చేద్దాం అని అన్నారు. చాలా సంతోషం కలిగింది. నాకు తెలుగు చిత్రాలంటే చాలా ఇష్టం. ప్రదీప్ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న చిత్రంలో హీరోగా నటించనున్నాను. నాకు నటులు సూర్య, అజిత్‌లంటే చాలా ఇష్టం అయినా నటనలో స్ఫూర్తి మాత్రం ఎస్.జే. సూర్యనే. ఇకపై కూడా నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ అని మిథున్ చెప్పారు.