బాలీవుడ్ వెటరన్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని పాకిస్థాన్ నటీనటుల పనితీరును ప్రశంసించారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ వెటరన్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని పాకిస్థాన్ నటీనటుల పనితీరును ప్రశంసించారు. అయితే వాళ్లు భారతీయ సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయంపై వ్యాఖ్యానించబోనని అన్నారు.
ఉడీ ఉగ్రవాద దాడి, భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై హేమమాలిని స్పందిస్తూ.. తామంతా కళాకారులమని, పాక్ నటులు ఇక్కడికి కళా ప్రదర్శనకు వచ్చారని అన్నారు. అయితే పాక్ నటులు ఇక్కడ ఉండాలా వద్దా అనే విషయంపై తాను మాట్లాడనని చెప్పారు.