హలో బాస్ అంటున్న ప్రియమణి
అందాల భామ ప్రియమణి హలో బాస్ అంటూ తమిళ ప్రేక్షకులను పలకరించడానికి మరోసారి కోలీవుడ్ తెరపైకి రానున్నారు. ఈ బ్యూటీతో పాటు నాన్ ఈ ఫేమ్ సుదీప్,
అందాల భామ ప్రియమణి హలో బాస్ అంటూ తమిళ ప్రేక్షకులను పలకరించడానికి మరోసారి కోలీవుడ్ తెరపైకి రానున్నారు. ఈ బ్యూటీతో పాటు నాన్ ఈ ఫేమ్ సుదీప్, నటి భావన కూడా రానున్నారు. ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా నాన్ అడిమై ఇల్లై, అడత్త వారిసు వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ కన్నడ నటుడు ద్వారఖేష్ తన ద్వారఖేష్ చిత్ర పతాకంపై నిర్మించిన కన్నడ చిత్రం విష్ణువర్ధనా. ప్రియమణి ద్విపాత్రాభినయం చేసిన చారులత చిత్ర దర్శకుడు పొన్‌కుమరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సుదీప్ హీరోగాను, ప్రియమణి, భావన హీరోయిన్లుగాను నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో సోనుసూద్, ఆర్తి, ద్వారఖేష్ తదితరులు నటించారు. చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు హీరో సుదీప్‌కు స్టార్ అంతస్తును తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని తమిళంలోకి హలోబాస్ పేరుతో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.