నేను నా బాయ్‌ఫ్రెండ్స్

నేను నా బాయ్‌ఫ్రెండ్స్


‘‘నాకు సైట్ కొట్టడానికి ....నా బయోడేటా కావాలా ?’’ అంటూ తన లవర్‌ను కన్‌ఫ్యూజ్ చేసిన కుమారి గుర్తుంది కదూ! ఆ పాత్రతో హెబ్బా పటేల్ కుర్రకారు కలల రాణి అయిపోయారు. ఇప్పుడామె కథానాయికగా మరో చిత్రం రూపొందుతోంది.  ‘సినిమా చూపిస్త మావ’తో ఓ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్  ‘నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ పేరుతో ఈ  చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘నిర్మాతగా ఇటీవలే పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేశా. కథనే నమ్ముకుని సినిమాలు తీస్తా.ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడైన భాస్కర్ బండి చెప్పిన కథ అమితంగా నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఈ కథ కోసం ఏడాది పాటు శ్రమించాం’’ అని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top