'మహానటి' ఆమె కాదు..! | Havent approached Vidya Balan for Savitri biopic | Sakshi
Sakshi News home page

'మహానటి' ఆమె కాదు..!

Aug 4 2016 10:26 AM | Updated on Sep 4 2017 7:50 AM

'మహానటి' ఆమె కాదు..!

'మహానటి' ఆమె కాదు..!

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ అశ్విన్. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన అశ్విన్, రెండో సినిమాతో భారీ సాహసమే చేస్తున్నాడు. తెలుగు తెరపై తిరుగు లేని స్టార్ డమ్ను...

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ అశ్విన్. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన అశ్విన్, రెండో సినిమాతో భారీ సాహసమే చేస్తున్నాడు. తెలుగు తెరపై తిరుగు లేని స్టార్ డమ్ను సాధించిన అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. మహానటి పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. ఇప్పటికే డర్టీ పిక్చర్, కహానీ లాంటి సినిమాలతో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న విద్య అయితేనే మహానటి పాత్రకు న్యాయం చేస్తుందన్న టాక్ వినిపించింది. అదే సమయంలో డర్టీ పిక్చర్ లాంటి బోల్డ్ మూవీలో నటించిన ఈమెను హుందాగా ఉండే సావిత్రి పాత్రకు ఎంపిక చేయటం కరెక్ట్ కాదని కూడా కొంత మంది భావించారు.

అయితే ఈ వార్తలపై చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ స్పందించాడు. ప్రస్తుతం మహానటి సినిమా స్క్రిప్ట్  దశలోనే ఉందన్న అశ్విన్.. ఇంత వరకు నటీనటుల ఎంపిక జరగలేదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ మీదే దృష్టి పెట్టానని, అది పూర్తయిన తరువాతే.. నటీనటులను నిర్ణయిస్తానని, ఇప్పటి వరకు ఎవరి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement