మణిరత్నం క్లాసిక్లో ఛాన్స్ కొట్టేశాడు | Harshvardhan Rane in Gharshana Hindi remake | Sakshi
Sakshi News home page

మణిరత్నం క్లాసిక్లో ఛాన్స్ కొట్టేశాడు

Jul 27 2016 11:42 AM | Updated on Sep 4 2017 6:35 AM

మణిరత్నం క్లాసిక్లో ఛాన్స్ కొట్టేశాడు

మణిరత్నం క్లాసిక్లో ఛాన్స్ కొట్టేశాడు

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అయి.., ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటుడు హర్షవర్థన్ రాణే. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో లీడ్ రోల్లో....

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అయి.., ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటుడు హర్షవర్థన్ రాణే. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో లీడ్ రోల్లో నటించిన ఈ మ్యాన్లీ హీరో,  స్టార్ ఇమేజ్ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ఓ గోల్డెన్ ఛాన్స్ రాణేను వెతుక్కుంటూ వచ్చింది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన క్లాసిక్ ఘర్షణ. ఇప్పుడు ఈ సినిమాను బెజోయ్ నంభియార్ దర్శకత్వంలో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ చేసిన పాత్రకు తమిళ స్టార్ ధనుష్ను ఎంపిక చేయగా.. తాజాగా ప్రభు పాత్రకు హర్షవర్థన్ రాణేను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాతో అయినా హర్షవర్ధన్ రాణేకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement