అత్యధిక వసూళ్లు హీరో అతడే! | Harrison Ford named as highest grossing Hollywood actor | Sakshi
Sakshi News home page

అత్యధిక వసూళ్లు హీరో అతడే!

Jan 11 2016 9:21 AM | Updated on Sep 3 2017 3:29 PM

అత్యధిక వసూళ్లు హీరో అతడే!

అత్యధిక వసూళ్లు హీరో అతడే!

హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ అరుదైన ఘనత సాధించాడు. హాలీవుడ్ చరిత్రలో హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా నిలిచాడు.

న్యూయార్క్‌: హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ అరుదైన ఘనత సాధించాడు. హాలీవుడ్ చరిత్రలో హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా నిలిచాడు. 73 ఏళ్ల హారిసన్ నటించిన 41 సినిమాలు రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు వసూలు చేశాయి. ఈ సినిమాల మొత్తం వసూళ్లు 4.7 బిలియన్ డాలర్లుగా తేలింది. తాజా చిత్రం 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకన్' కలెక్షన్స్ వర్షం కురిపిస్తుండడంతో హారీసన్ హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఈ సినిమా ఇప్పటికే 770 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది.

ఇప్పటివరకు హయ్యస్ట్ గ్రాసింగ్ నటుడిగా ఉన్న 67 ఏళ్ల శామ్యుల్ ఎల్ జాక్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. అతడు నటించిన 68 సినిమాల మొత్తం వసూళ్లు 4.6 బిలియన్ డాలర్లు. టామ్ హాంక్స్, మోర్గాన్ ఫ్రీమాన్, ఎడీ మార్ఫీ లాంటి నటులు టాప్‌ ఫైవ్ నుంచి పడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement