హీరో కజిన్‌ 'వ్యక్తిగత' వీడియో లీకైంది! | Harman Baweja brother personal video leaked online | Sakshi
Sakshi News home page

హీరో కజిన్‌ 'వ్యక్తిగత' వీడియో లీకైంది!

May 28 2016 1:49 PM | Updated on Sep 4 2017 1:08 AM

హీరో కజిన్‌ 'వ్యక్తిగత' వీడియో లీకైంది!

హీరో కజిన్‌ 'వ్యక్తిగత' వీడియో లీకైంది!

బాలీవుడ్‌ హీరో హర్మాన్ బవేజా కజిన్ జానీ బవేజా వ్యక్తిగత వీడియో ఒకటి లీకై.. సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

బాలీవుడ్‌ హీరో హర్మాన్ బవేజా కజిన్ జానీ బవేజా వ్యక్తిగత వీడియో ఒకటి లీకై.. సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. జానీ ప్రస్తుతం 'స్కాండల్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక హాట్‌ సీన్‌ లీకైంది. బెడ్‌ మీద సహ నటిని ఘాటుగా ముద్దాడుతున్నట్టు ఉన్న 17 సెకన్ల వీడియో సోషల్‌ మీడియాలోనూ, యూట్యూబ్‌లో వైరల్‌ గా మారిపోయింది.

చిత్ర యూనిట్‌కు తెలియకుండానే ఈ దృశ్యం లీకవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని జానీ బవేజా చెప్పాడు. 'ఈ దృశ్యాల్లో నేనే ఉన్నాను. ఇది ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇది (స్కాండల్‌) సినిమా దృశ్యం. ఇందులో నేను రిహార్సల్ చేస్తున్న దృశ్యం అది. ఇది చాలా వ్యక్తిగతమైన వీడియో' అని బవేజా వాపోయాడు. ఇలాంటి వీడియోను ఎలా లీక్ చేస్తారని అతడు ప్రశ్నిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement