చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు | Goutham rajkumar about Desam lo Dongalu Paddaru | Sakshi
Sakshi News home page

చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు

Sep 29 2018 3:32 AM | Updated on Sep 29 2018 3:32 AM

Goutham rajkumar about Desam lo Dongalu Paddaru - Sakshi

గౌతమ్‌ రాజ్‌కుమార్‌

‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్‌ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్‌ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్‌ వచ్చింది’’ అని డైరెక్టర్‌ గౌతమ్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్‌ అలీ సమర్పణలో రమా గౌతమ్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. గౌతమ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది.

ఈ బ్యాగ్రౌండ్‌లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్‌ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్‌ ఉండడం వల్లే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి సెలెక్ట్‌ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్‌ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్‌ జానర్‌ కావడంతో సహజంగా రామ్‌గోపాల్‌ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో  పోల్చి ఉంటారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement