అందర్నీ బతికిద్దాం! | gopichand new movie oxygen | Sakshi
Sakshi News home page

అందర్నీ బతికిద్దాం!

Aug 14 2016 10:52 PM | Updated on Sep 4 2017 9:17 AM

అందర్నీ బతికిద్దాం!

అందర్నీ బతికిద్దాం!

‘బతకడం మన లక్ష్యం.. ఎదగడం కోసం యుద్ధం చేయడం మన కర్తవ్యం.. మనం బతుకుదాం..

‘బతకడం మన లక్ష్యం.. ఎదగడం కోసం యుద్ధం చేయడం మన కర్తవ్యం.. మనం బతుకుదాం.. అందర్నీ బతికిద్దాం’ అనే కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆక్సిజన్’. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.

ఓ వైపు చిత్రీకరణ చేస్తూ, మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించాం. సెప్టెంబర్‌లో పాటల్ని, చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వెట్రి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: యువన్ శంకర్ రాజా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement