మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ | gopi sunder music for Mahesh, Vami paidipally Movie | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్

Nov 20 2016 1:10 PM | Updated on Sep 4 2017 8:38 PM

మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్

మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్లో...

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే మరో సినిమాను ప్రారంభించనున్నాడు మహేష్. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్కు రెడీ అవుతున్నాడు.

అంతేకాదు కొరటాల సినిమా తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పేశాడు మహేష్. పీవీపీ సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించనుంది. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు స్వరాలందించనున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమాకు మ్యూజిక్ చేసిన గోపిసుందర్ మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement