ఆహ్లాదకరమైన ప్రేమకథ | Good Response To Nuvvala Nenila First Look | Sakshi
Sakshi News home page

ఆహ్లాదకరమైన ప్రేమకథ

Feb 16 2014 11:57 PM | Updated on Sep 2 2017 3:46 AM

ఆహ్లాదకరమైన ప్రేమకథ

ఆహ్లాదకరమైన ప్రేమకథ

వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నువ్వలా.. నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరు రాజశేఖర్‌రెడ్డి

వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నువ్వలా.. నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరు రాజశేఖర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. సాయికార్తీక్ స్వరపరచిన పాటలను ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇది క్లాసికల్ లవ్‌స్టోరీ.
 
 ఇప్పటివరకు చేయని పాత్రను వరుణ్ చేశారు. పూర్ణ పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -  ‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆహ్లాదకరమైన ప్రేమకథతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ, సాయికార్తీక్ పాటలు, వరుణ్, పూర్ణల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ భాగవతుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకుర్తి శ్రీధర్‌గౌడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement