ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చా! | good Response on Raju Gari Gadhi | Sakshi
Sakshi News home page

ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చా!

Oct 25 2015 1:29 AM | Updated on Sep 3 2017 11:25 AM

ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చా!

ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చా!

నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) లో ఆడాలని నా డ్రీమ్. నాలుగైదు సినిమాల్లో నటిస్తేనే

‘‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) లో ఆడాలని నా డ్రీమ్. నాలుగైదు సినిమాల్లో నటిస్తేనే ఆడే అర్హత వస్తుందని సినిమాల్లోకి అడుగుపెట్టా’’ అని హీరో అశ్విన్ అన్నారు. అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా నటించిన ‘రాజుగారి గది’ ఇటీవలే విడుదలైంది. అశ్విన్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రాన్ని డిసెంబరు 4న విడుదల చేద్దామనుకున్నాం. కానీ నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర సహకారంతో ఈ నెల 22న విడుదల చేసి నన్ను దసరా హీరో చేశారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను నటించిన ‘జత కలిసే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement