చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ | Good Family Entertainer | Sakshi
Sakshi News home page

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Jun 14 2014 12:31 AM | Updated on Sep 2 2017 8:45 AM

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’.

ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. రెహాన్, అమోఘ్ దేశపతి, శ్వేతా జాదవ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించాం’’ అని చెప్పారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తమకు మంచి బ్రేక్ ఇస్తుందని రెహన్, శ్వేతా జాదవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి, మాటలు: రమేశ్‌రెడ్డి పూనూరు, సుకుమారన్.

Advertisement
 
Advertisement
Advertisement