అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్ | From Salman Khan to Alia Bhatt, Akshay Kumar thanks everyone for supporting 'Rustom' | Sakshi
Sakshi News home page

అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్

Aug 19 2016 6:34 PM | Updated on Sep 4 2017 9:58 AM

అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్

అందరికీ థాంక్స్ అంటున్న అక్షయ్

బాలీవుడ్ రుస్తుం అక్షయ్ తన డాన్స్తో అందరికీ థాంక్స్ చెబుతున్నాడు. ఇటీవల రిలీజైన 'రుస్తుం' కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళుతోంది.

బాలీవుడ్ రుస్తుం అక్షయ్ తన డాన్స్తో అందరికీ థాంక్స్ చెబుతున్నాడు. ఇటీవల రిలీజైన 'రుస్తుం' టాక్ మాట ఎలా ఉన్నా, వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళుతోంది. రుస్తుం రిలీజ్కు ముందు బీ-టౌన్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, అలియా భట్ తదితరులు షార్ట్ వీడియోలు రూపొందించి రుస్తుం సినిమాను ప్రమోట్ చేస్తూ అక్షయ్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు తన వంతు అంటున్నాడు అక్షయ్.  మీరు చూపించిన ప్రేమకు థాంక్స్ మాత్రమే చెబితే సరిపోదంటూ.. చిన్న డ్యాన్స్ వీడియోను రూపొందించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే 'రుస్తుం'ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 

అలాగే తన భార్య ట్వింకిల్ ఖన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. 'మిసెస్.ఫన్నీ బోన్స్' పేరుతో తొలిసారి రచయిత్రిగా మారి రాసిన పుస్తకం ఇప్పటికి లక్ష కాపీలు అమ్ముడయిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇక తను ఇంట్లో సైలెంట్గా ఉండాల్సిన సమయం వచ్చేసిందంటూ చమత్కరించారు అక్షయ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement