బతికున్నప్పుడే పాతిపెడతారని భయం!

Fear that you will be buried alive - Sakshi

ఇవాళ త్రిష చాలామంది కొత్త కథానాయికలకు రోల్‌ మోడల్‌. ఎందుకంటే..ఈ చెన్నై చందమామ సిల్వర్‌ స్క్రీన్‌ మీదకొచ్చి పదిహేనేళ్లయింది.ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇన్నేళ్లయినా ఇంకా బిజీగాసినిమాలు చేస్తున్నారంటే త్రిష హార్డ్‌వర్కే కారణం. 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్రిష తన ఫ్యాన్స్‌ అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీగా జవాబు చెప్పారు.

పదిహేనేళ్లలో మీరు నేర్చుకున్నదేంటి?
మనం అనుకున్న విధంగా అన్నీ జరగవు. అలా జరగకపోవడం కూడా మన మంచికే.

మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం?
బతికున్నప్పుడే పాతిపెట్టడం. అయినా నన్నెవరలా చేస్తారు? కాకపోతే అప్పుడప్పుడూ ఈ ఆలోచన వస్తుంది. అప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది.

మీ దృష్టిలో ప్రేమంటే ?
జీవితానికి కావాల్సిన విషయం. లవ్‌ అంటే మేజిక్‌.

మీ బలం?
నా బ్రెయిన్‌

కొత్త హీరోయిన్లకు మీరిచ్చే సలహా?
హార్డ్‌ వర్క్‌ చేయాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇతరులను గౌరవించాలి.

ఉదయం నిద్రలేవగానే మీరు చేసే యాక్టివిటీ?
సూపర్‌ బ్రెయిన్‌ యోగా

షూటింగ్‌ స్పాట్‌లో అప్‌సెట్‌ అయితే..?
నా వ్యానిటీ వేన్‌లోకి వెళ్లి, సైలెంట్‌గా కూర్చుంటా.

ప్రస్తుతం మీరు చదువుతున్న బుక్‌?
ది బ్రేక్‌డౌన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top