అయిదో అంతస్తు... ఏడు కార్లు!

అయిదో అంతస్తు... ఏడు కార్లు!


అదో పెద్ద బిల్డింగ్. అందులో అది అయిదో అంతస్తు. ఆ బిల్డింగ్ బయట 35 నుంచి 45 కార్లు ఆగి ఉన్నాయి. ఆ అయిదో అంతస్తులోని పార్కింగ్ స్పేస్ నుంచి సడన్‌గా ఏడు కార్లు రోడ్డు మీద ఉన్న కార్ల మీద పడి పెద్ద విస్ఫోటనం సృష్టించాయి. ఆ రోడ్డు మీద ఉన్న జనాలందరూ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అసలింత విధ్వంసం ఎక్కడ జరిగిందనేదే కదా మీ అనుమానం. హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఎనిమిదో భాగం ‘ఫాస్ట్ 8’ కోసం ఆ చిత్ర దర్శకుడు ఎఫ్.గ్యారీ గ్రే చిత్రీకరించిన సన్నివేశం ఇది.అయితే పై నుంచి పడే ఏడు కారుల్లోనూ డ్రైవర్లు లేకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. అయిదో అంతస్తు నుంచి కార్లను అమాంతంగా పడేయడం కోసం చిత్రబృందం చాలా కష్టాలే పడ్డారట. కార్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఓ క్రమంలో పడితేనే షాట్ ఓకే అవుతుంది. పక్కా ప్లాన్‌తో రీటేక్ లేకుండా ఈ సీన్ తీయడం విశేషం. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్  లాంటి హాలీవుడ్ సూపర్‌స్టార్స్ నటిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ సినిమా ఇలా ఉంటుంది’ అని శాంపిల్ కూడా చూపిస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలను ఆ సినిమా విడుదలయ్యాక యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. కానీ, ‘ఫాస్ట్ 8’ యూనిట్ మాత్రం విడుదలకు ముందే మేకింగ్ వీడియో రిలీజ్ చేసి, అభిమానులను ఊరిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top