స్కిన్‌ కలర్‌పై క్లాస్‌ పీకిన హీరోయిన్‌ | Eesha Rebba Strong Reply To A fan Who Questioned Her Skin Colour | Sakshi
Sakshi News home page

Oct 24 2018 7:53 PM | Updated on Oct 24 2018 7:53 PM

Eesha Rebba Strong Reply To A fan Who Questioned Her Skin Colour - Sakshi

ఈషా రెబ్బా

హీరోలు ఎలా ఉన్నా సరే కానీ హీరోయిన్‌ మాత్రం తెల్లగా ఉండాలా?

‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్‌ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో ఈషా ఎప్పుడూ ముందుంటారు. అ! మూవీలో లెస్బియన్‌ పాత్రలో నటించి ఔరా అనిపించారు. అయితే ట్విటర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్‌గా రిప్లే ఇచ్చారు తెలుగుమ్మాయి ఈషా.

ఓ అభిమాని ‘ఈషాగారు మీరు కొంచెం కలర్‌ ఉంటే మీకు తిరుగే ఉండేది కాదు’ అని కామెంట్‌ చేశారు. దీనికి చిర్రెత్తుకుపోయిన ఈ అమ్మడు..  ‘ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా???’  అనే ట్వీట్‌తో బుద్ది చెప్పారు. అవును మరీ ఈషా అన్నది పాయింటే కదా.. హీరోలు ఎలా ఉన్నా సరే కానీ హీరోయిన్‌ మాత్రం తెల్లగా ఉండాలా? ఇదెక్కడి లాజిక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement