‘ఇంతలా ప్రేమిస్తే.. నా దగ్గర తిరిగివ్వడానికేం లేదు’  | Ee Maya Peremito Movie Teaser Launched By Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Jun 12 2018 4:31 PM | Updated on Aug 29 2018 5:43 PM

Ee Maya Peremito Movie Teaser Launched By Naga Chaitanya - Sakshi

టాలీవుడ్‌కు ఒక ఫార్ములా ఉంది. పైగా అది ఎప్పుడు సక్సెస్‌ అయ్యే ఫార్ములా. అదే ప్రేమకథ. ఇప్పటివరకు టాలీవుడ్‌లో లెక్కలేనన్ని ప్రేమకథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వస్తాయి. తాజాగా మరొక ప్రేమ కథ మనముందుకు రాబోతోంది. ‘ఈ మాయ పేరేమిటో’ అంటూ కొత్త హీరో, హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను నాగచైతన్య రిలీజ్‌ చేశారు. సీనియర్‌ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తుండటం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ 36 సెకన్ల టీజర్‌.. పూర్తిగా నేపథ్య సంగీతంతోనే నడిచింది. ‘ఇంతలా ప్రేమిస్తే..  నా దగ్గర తిరిగివ్వడానికేం లేదు’ అనే ఒక్క డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చేశారు. రాహుల్‌ విజయ్‌, కావ్యా థాపర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దివ్యా విజయ్‌ నిర్మించగా, రమేష్‌ కొప్పుల దర్శకత్వం వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement