సూపర్‌ హిట్‌ జర్నీ | Dynamic Lady Director Jaya.B's new film from June | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌ జర్నీ

Jan 7 2018 12:44 AM | Updated on Jan 7 2018 12:44 AM

Dynamic Lady Director Jaya.B's new film from June - Sakshi

పాత్రికేయుడిగా, ‘సూపర్‌హిట్‌’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా బీఏ రాజు జర్నీ సక్సెస్‌ఫుల్‌. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా విశేషాలను తెలియజేశారు. ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ. బి దర్శకత్వంలో ఆర్‌జే సినిమాస్‌ పతాకంపై బీఏ రాజు మరో సినిమా నిర్మించనున్నారు.

ఆయన మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా 15 ఇయర్స్‌ కంప్లీట్‌ అయ్యాయి. మా బేనర్‌లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతేడాది నిర్మించిన ‘వైశాఖం’ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టాం. స్టోరీ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement