విలనిజం చూపిస్తా | DS Rao new look as villain | Sakshi
Sakshi News home page

విలనిజం చూపిస్తా

Nov 10 2018 1:33 AM | Updated on Nov 10 2018 1:33 AM

DS Rao new look as villain - Sakshi

డీఎస్‌ రావు

‘ద్రోణ, పిల్ల జమిందార్, మిస్టర్‌ నూకయ్య’ వంటి చిత్రాలను నిర్మించారు డీఎస్‌ రావు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరాహోరీ’ చిత్రంతో విలన్‌గా పరిచయం అయ్యారు. నటుడిగా కొన్ని సినిమాలు చేశారాయన. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా డీఎస్‌ రావు మీడియాతో మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ఇప్పటి వరకూ 20 సినిమాలు నిర్మించా. తేజగారి ప్రోత్సాహంతో నటుడిగానూ మారాను. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రాణిస్తున్నాను. మంచి కథ ఉంటే కచ్చితంగా సినిమా నిర్మిస్తాను. విలన్‌గా నిరూపించుకోవాలనుంది. సరికొత్త విలనిజం చూపిస్తా’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement