నమ్మితేనే చేస్తా : నాని | Sakshi
Sakshi News home page

నమ్మితేనే చేస్తా : నాని

Published Wed, Jun 15 2016 1:41 PM

నమ్మితేనే చేస్తా : నాని

వరుసగా మూడు సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం జెంటిల్మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేయనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల తరువాత కొంత మంది మిత్రులు, కమర్షియల్ సినిమాలు చేయాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. నేను ప్రయోగాలు చేయటం నచ్చని వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు కూడా తీసుకువచ్చారు. కానీ నేను మాత్రం నేను నమ్మిన సబ్జెక్ట్ తోనే సినిమా చేస్తా'నంటూ తెలిపాడు.

'జెంటిల్మేన్ సినిమా అంగీకరించిన సమయంలో కొంత మంది వద్దన్నారు. నిజంగానే వాళ్లు అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ కాకపోవచ్చేమో.. కానీ నేను మాత్రం నమ్మిన సినిమా చేశాననే సంతృఫ్తి పొందుతా. అంతేకానీ నేను నమ్మని కథతో సినిమా చేసి ఇబ్బంది పడలేను'. అంటూ తను జెంటిల్మేన్ అంగీకరించటంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న జెంటిల్మేన్ సినిమాలో నాని సరసన సురభి, నివేదితా థామస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement