
ఆయనతో కష్టమే!
సీనియర్ అని గౌరవమో... లేక ఓల్డేజ్ గైతో రొమాన్స్‌లో పసలేదనో...
సీనియర్ అని గౌరవమో... లేక ఓల్డేజ్ గైతో రొమాన్స్‌లో పసలేదనో... మొత్తానికి మల్లికాషెరావత్ మనసులో మాటైతే బయట పెట్టేసింది. ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాలో ఓంపురితో కలసి చేసిన మల్లిక... ఆయనతో ‘బోల్డ్’ సీన్స్‌లో నటించడం ఎంతో కష్టమంటోంది. అయితే... ఆయన ‘ఎక్స్‌పీరియన్స్’ తనను కంఫర్టబుల్‌గా మార్చేసిందని వెంటనే కవరింగ్ ఇచ్చేసింది.
‘ఈ సినిమాలో ఓంపురితో నాకు కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నాయి. తొలుత ఎలా చేయాలో ఆందోళన పడ్డా. కానీ ఆయన అనుభవం నాలోని ఆందోళన పోగొట్టింది. నిజంగా ఆయన ఓ ప్రొఫెషనల్’ అంటూ తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుందీ సెక్సీ తార! కెరీర్‌లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... గాడ్‌ఫాదర్ ఎవరూ లేకనే ఈ పరిస్థితని గోడు వెళ్లబోసుకుంది.