హిట్‌ డైరెక్టర్‌ కొడుకు ఇరగదీశాడు..! | Director Maruthi Son Aasreesh Playing Drums | Sakshi
Sakshi News home page

హిట్‌ డైరెక్టర్‌ కొడుకు ఇరగదీశాడు..!

Oct 31 2017 10:30 AM | Updated on Sep 27 2018 8:49 PM

Director Maruthi Son Aasreesh Playing Drums - Sakshi

భలే భలే మొగాడివోయ్‌ సినిమాతో స్టార్‌ లీగ్‌ లోకి ఎంటర్‌ అయిన దర్శకుడు మారుతి. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్నిఅందుకున్న మారుతి త్వరలో నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న మారుతి తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేశాడు.

నిర్మాతగా, దర్శకుడిగా సినీ అభిమానులకు సుపరిచితుడైన మారుతి ఫ్యామిలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తాజాగా ఆయన తన వారసుణ్ని అభిమానులకు పరిచయం చేశాడు. డ్రమ్స్‌ వాయిస్తున్న తన కొడుకు ఆశ్రిష్‌ వీడియోను ట్విట్టర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన మారుతి ‘మా అబ్బాయి కొత్త వీడియో’ అంటూ కామెంట్‌ చేశారు. వీడియోలో మారుతి కొడుకు డ్రమ్స్‌ వాయించడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. తండ్రి కామెడీ ఎంటర్‌ టైనర్‌లతో ఆకట్టుకుంటుంటే ఆశ్రిష్‌ సంగీత వాయిద్యాలతో మైమరపిస్తున్నాడు. ఈ కుర్రాడి జోరు చూస్తుంటే టాలీవుడ్‌కి త్వరలో సంగీత దర్శకుడు పరిచయం అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement